Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఏథెన్స్ నగరంలో అందాల నాయికలు!
  • సినిమాలు తిరస్కరిస్తున్న అనుష్క 
  • సీక్వెల్ వద్దన్న రజనీకాంత్ 
  • పాటల కోసం విదేశాలకు 'నర్తనశాల' 

*  అందాల భామలు కాజల్, తమన్నా ప్రస్తుతం గ్రీస్ లోని ఏథెన్స్ లో వున్నారు. 'క్వీన్' హిందీ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ కోసం తమన్నా, తమిళ రీమేక్ కోసం కాజల్ ప్రస్తుతం ఏథెన్స్ నగరంలో వున్నారు. తమిళ వెర్షన్ కి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  'భాగమతి' సినిమా తర్వాత కథానాయిక అనుష్క ఐదారు సినిమాలను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యే ఉద్దేశంతోనే అమ్మడు ఇప్పుడు సినిమాలు ఒప్పుకోవడం లేదని అంటున్నారు.
*  రజనీకాంత్ కెరీర్లో 'బాషా' చిత్రానికొక ప్రత్యేకత వుంది. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ మూవీ అది. దీనికి సీక్వెల్ చేసే ఉద్దేశంతో సాయిరమణి అనే దర్శకుడు ఇటీవల రజనీని కలసి, కథ వినిపించాడట. రజనీకి కథ నచ్చినప్పటికీ, సీక్వెల్ చేయడానికి ఆయన అంగీకరించలేదని సమాచారం. క్లాసిక్స్ వంటి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేయకూడదన్నది రజనీ అభిప్రాయమట.
*  నాగశౌర్య కథానాయకుడుగా నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నర్తనశాల' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలోనే పాటలని విదేశాల్లో చిత్రీకరించనున్నారు.  

Kajal Agarwal
Thamanna
Anushka Shetty
Rajanikanth
  • Loading...

More Telugu News