sc: మాకు ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తున్నారు: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ ల ఆవేదన

  • సీనియారిటీ ఉన్న నేతలకు కూడా ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తున్నారు
  • ఉద్దేశపూర్వకంగానే ఇది జరుగుతోంది
  • సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లిన ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ లు

తమకు ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తున్నారంటూ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తమకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని వారు కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీనియారిటీ ఎక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారులకు కూడా కీలకమైన పోస్టింగులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ సమస్యలను రాతపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ తమను కోరారని చెప్పారు. సీఎస్ ను కలిసిన వారిలో భారతి హొలికేరి, శ్యామ్ నాయక్, చంపాలాల్, భారతి లక్ పతి నాయక్, ప్రీతి మీనా, మురళి తదితరులు ఉన్నారు.

sc
st
ias
telangana
cs
  • Loading...

More Telugu News