kalyan dev: బావగారి ట్రైలర్ చరణ్ కి బాగా నచ్చేసిందట!

- రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత'
- కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్
- వచ్చేనెల 12వ తేదీన విడుదల
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ కి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
