nayan: యాక్షన్ థ్రిల్లర్ తో వస్తోన్న నయన్ .. అదరగొట్టేస్తోన్న ట్రైలర్

  • యాక్షన్ థ్రిల్లర్ గా 'ఇమైక్కా నోడిగళ్'
  • యువజంటగా అధర్వ .. రాశి ఖన్నా
  • కీలకమైన పాత్రలో నయనతార   

సినిమాల విషయంలో నయనతార ప్లానింగును ఆమె తోటి నటీనటులే ఎంతగానో మెచ్చుకుంటూ వుంటారు. కథలు వినడంలోనూ .. పాత్రల తీరుతెన్నులను అర్థం చేసుకోవడంలోను .. దర్శకుడి ప్రతిభాపాటవాలను అంచనా వేయడంలోను ఆమె మంచి నేర్పరి అని చెబుతారు. అలాంటి నయనతార తాజా చిత్రంగా 'ఇమైక్కా నోడిగళ్' రూపొందుతోంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సైకో చేసే వరుస హత్యలు భయాందోళనలు కలిగిస్తూ వుంటే, అతని కోసం అన్వేషించే ఆఫీసర్ పాత్రలో నయనతార అదరగొట్టేస్తోంది. ఇక లవ్ బర్డ్స్ గా అధర్వ .. రాశిఖన్నా కనిపిస్తున్నారు. 'డిమోంటే కాలని' ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

nayan
adharva
rasi khanna
  • Error fetching data: Network response was not ok

More Telugu News