president: రాష్ట్రపతి దంపతుల పట్ల పూరీ ఆలయంలో సిబ్బంది అనుచిత ప్రవర్తన... విచారణకు కలెక్టర్ ఆదేశం!
- ఆలయ సందర్శన సమయంలో రాష్ట్రపతి దంపతులకు చేరువగా వచ్చిన సేవకులు
- రాష్ట్రపతి భవన్ నిరసన నేపథ్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశం
- మరోవైపు ఆలయ ఖజానా తాళాలు పోవడంపైనా విచారణ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవిత పట్ల ఓడిశాలోని పూరీ ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 18న రాష్ట్రపతి దంపతులు పూరీ జగన్నాథుడ్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయ సేవకులు రాష్ట్రపతి దంపతులకు అతి చేరువగా వచ్చి అసౌకర్యానికి గురి చేశారు.
దీనిపై రాష్ట్రపతి భవన్ నిరసన తెలియజేస్తూ మార్చి 19న పూరీ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది. దీంతో విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు పూరీ ఆలయ ఖాజానాకు చెందిన 12వ శతాబ్దపు తాళాలు కనిపించకుండా పోవడంపై ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణకు సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. ఈ ఏడాది జూలై 14న జగన్నాథుని వార్షిక రథయాత్ర జరగనుంది. దీని తర్వాత విచారణ నివేదిక ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.