BJP: అమరావతి ప్రాంతంలో టీడీపీ హోర్డింగులు.. బీజేపీ సీరియస్!

  • పురందేశ్వరి, కన్నా టార్గెట్ గా హోర్డింగులు
  • కాట్రగడ్డ బాబు పేరిట ఏర్పాటు
  • ఇరు పార్టీల మధ్యా మాటల యుద్ధం

తెలుగుదేశం పార్టీ, బీజేపీల మధ్య ఇప్పుడు సరికొత్త యుద్ధం మొదలైంది. అదే హోర్డింగ్స్, వాల్ పోస్టర్ వార్. విజయవాడ ప్రాంతంలో వెలసిన హోర్డింగ్స్  ఇప్పుడు రెండు పార్టీల మధ్యా గొడవలకు కారణం అవుతున్నాయి. హోర్డింగులు, గోడ పత్రికల ద్వారా బీజేపీ నేతలపై తెలుగుదేశం నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రజలకు దగ్గరైన సంక్షేమ పథకాల పేర్లు చెబుతూ, బీజేపీ నేతలను విమర్శిస్తూ ఈ హోర్డింగ్స్ కనిపిస్తుండగా, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర పథకాలను టీడీపీ తమవిగా చెప్పుకుంటోందని ఆరోపిస్తున్న నేతలు, కేంద్ర పథకాలను ప్రస్తావించిన హోర్డింగ్స్ లో మోదీ ఫొటోలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరిట ఈ హోర్డింగ్స్ వెలిశాయి. రాష్ట్రంపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ నేతల ఫొటోలను హోర్డింగులపై ఎందుకు పెట్టాలని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణను ఉద్దేశించి హోర్డింగ్ లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వీటిపై ఘాటైన సమాధానాన్ని చెబుతామని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తుండటంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.

BJP
Telugudesam
Hordings
Vijayawada
Purandeshwari
Katragadda babu
  • Loading...

More Telugu News