aditi seiya: రణబీర్ కు చెల్లిగా నటించినా... అతన్ని బ్రదర్ గా ఊహించుకోలేకపోయా: అదితి

  • రాజ్ కుమార్ హిరాణీ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు
  • ప్రియా దత్ ను నేను ఎన్నడూ చూడలేదు
  • రణబీర్ నటనను చూసి, అతని ఫ్యాన్ అయిపోయా

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు జోడీగా నటించాలని ఏ హీరోయిన్ అయినా అనుకుంటుంది. ఆయన చెల్లిగా నటించేందుకు మాత్రం ఎవరూ ఒప్పుకోరు. కానీ, అదితి శియ మాత్రం ఒప్పుకుంది. తెలుగులో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'నేనింతే' చిత్రంలో ఈ అమ్మడు నటించింది. శియా గౌతమ్ గా తెలుగు తెరకు పరిచయమైన ఆమె... ఆ తర్వాత అదితి శియగా పేరు మార్చుకుంది.

సంజయ్ దత్ బయోపిక్ 'సంజూ' సినిమాలో సంజయ్ దత్ చెల్లెలు ప్రియా దత్ క్యారెక్టర్ లో నటించిన అదితికి... చెల్లి పాత్రలో నటించడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా... రాజ్ కుమార్ హిరాణీ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు అని చెప్పింది. రణబీర్ కు చెల్లిగా నటించినప్పటికీ... అతన్ని మాత్రం బ్రదర్ గా ఊహించుకోలేకపోయానని తెలిపింది. ప్రియా దత్ ను తాను ఎప్పుడూ కలవలేదని... ఆవిడ ఇంటర్వ్యూలను చూసి, ఆమె మేనరిజమ్స్ నేర్చుకున్నానని చెప్పింది. సింగిల్ టేక్ లో యాక్ట్ చేయగల గొప్ప నటుడు రణబీర్ అంటూ కితాబిచ్చింది. అతనితో పని చేసిన తర్వాత తాను అతనికి ఫ్యాన్ అయిపోయానని చెప్పింది. 

aditi seiya
ranbir kapoor
sanju
bollywood
raj kumar hirani
  • Loading...

More Telugu News