Narendra Modi: రెండు ముఖ్యమైన పనుల కోసం మోదీ వద్దకు వెళుతున్నా: కేటీఆర్

  • నేడు మోదీని కలుస్తున్నా
  • బయ్యారం ఉక్కు, ఐటీఐఆర్ పై చర్చిస్తాను
  • ట్విట్టర్ లో వెల్లడించిన కేటీఆర్

నేడు తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళుతున్నానని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. మోదీని కలిసేందుకు ఎంతో ఆత్రుతతో ఉన్నట్టు చెప్పారు. పెండింగ్ లో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించనున్నట్టు వెల్లడించారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, హైదరాబాద్ లో ఐటీఐఆర్ ఏర్పాటుపై మోదీతో తాను మాట్లాడనున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

Narendra Modi
KTR
Twitter
Bayyaram Steel Plant
  • Error fetching data: Network response was not ok

More Telugu News