Supreme Court: పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే పై అధికారిని బాధ్యుడిని చేయలేము!: సుప్రీంకోర్టు కీలక రూలింగ్

  • పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర విద్యా శాఖ ఉద్యోగి
  • పై అధికారిని బాధ్యుడిని చేసిన ఔరంగాబాద్ బెంచ్
  • కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎవరైనా కింది స్థాయి ఉద్యోగి తనపై ఉన్న పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడితే, అతని పై అధికారిని బాధ్యుడిగా చేయలేమని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. కింది ఉద్యోగికి పని అప్పగించడాన్ని నేరంగా పరిగణించలేమని తేల్చింది. ఆఫీసులో పని అప్పగింత వెనుక సదరు ఉద్యోగిని వేధించాలన్న ఉద్దేశం ఉండకపోవచ్చని, పని ఇచ్చినంత మాత్రాన అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని పేర్కొంది. అంతకుముందు బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది.

ఔరంగాబాద్ లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పని చేస్తున్న కిషోర్ పరాశర్, గత సంవత్సరం ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారి వేధింపులు, అత్యధిక పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పరాశర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తొలుత విచారించిన ఔరంగాబాద్ బెంచ్ అతన్ని దోషిగా తేల్చగా, సదరు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, యూయూ లలిత్ లు కేసును విచారించి తాజా తీర్పిచ్చారు.

Supreme Court
India
Work Place
Sucide
Mumbai
  • Loading...

More Telugu News