Riyaaz Nikoo: అమర్ నాథ్ యాత్రకు వస్తున్న వారంతా మా అతిథులే... ఏమీ చేయబోము!: హిజ్బుల్ టాప్ కమాండర్ వీడియో సందేశం

  • అమర్ నాథ్ యాత్రికులు మా టార్గెట్ కాదు
  • దాడి చేస్తామని వస్తున్న వార్తలు అవాస్తవం
  • వీడియోలో హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ

ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర చేస్తున్న వారంతా తమ అతిథులేనని, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయబోమని హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "అమర్ నాథ్ యాత్రను మేము టార్గెట్ చేయబోము. యాత్రికులు తమ విశ్వాసాల ప్రకారం, పూజలు చేసేందుకు వస్తున్నారు. వారు మా లక్ష్యం కాదు" అని నైకూ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు.

టెర్రరిస్టులపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పన్నారని వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశాడు. యాత్రికులతో తామేమీ యుద్ధం చేయబోవడం లేదని, తాము తుపాకులు పట్టుకునేలా చేస్తున్న వారిపైనే తమ యుద్ధమని, తమ హక్కుల కోసం, తమ స్వాతంత్ర్యం కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశాడు. తమ యుద్ధం ఇండియాపైనే తప్ప, ఇండియాలోని ప్రజలపై కాదని చెబుతూ తన వీడియోను ముగించాడు. ఈ ఉదయం అమర్ నాథ్ యాత్రకు తొలి బ్యాచ్ బయలుదేరిన సమయంలో ఈ వీడియో విడుదల కావడం గమనార్హం.

Riyaaz Nikoo
Amarnath Yatra
Piligrims
Hizbul Muzahiddeen
Viral Videos
  • Loading...

More Telugu News