Tamil Nadu: వివాహమైన నెల రోజులకే ప్రియురాలితో భర్త జంప్.. భార్య ఆత్మహత్య!

  • అవమానం భరించలేక పుట్టింటికి చేరిన నవ వధువు
  • ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య
  • తమిళనాడులో ఘటన

పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఓ నవ వధువు జీవితం విషాదాంతమైంది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే భర్త తన ప్రియురాలితో కలిసి ఉడాయించాడు. తట్టుకోలేని భార్య అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తమిళనాడులోని ఆర్కేపేటలో మంగళవారం జరిగిందీ విషాద ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకాలోని రంగాపురానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనాదేవి (21)కి నెల రోజుల క్రితం వేలూరు జిల్లా పుదూరుకు చెందిన తంగరాజుతో వివాహమైంది. అయితే, అప్పటికే మరో యువతి ప్రేమలో మునిగి తేలుతున్న తంగరాజు తాజాగా ప్రియురాలితో కలిసి పరారయ్యాడు.

అవమాన భారం తట్టుకోలేని అర్చన పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu
Suicide
Marriage
Lover
  • Loading...

More Telugu News