Donald Trump: ట్రంప్‌కు తొలిసారి భారీ విజయం.. ట్రావెల్ బ్యాన్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు!

  • ట్రావెల్ బ్యాన్‌ను సమర్థించిన సుప్రీం కోర్టు
  • ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉందన్న ప్రభుత్వం
  • సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి భారీ విజయం దక్కింది. ముస్లిం ఆధిపత్య దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధిస్తూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని (ట్రావెల్ బ్యాన్)ను ఆ దేశ సుప్రీం కోర్టు సమర్థించింది. సుప్రీం తీర్పు విని ట్రంప్ ‘వావ్’ అంటూ స్పందించారు.

ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రయాణ నిషేధంపై జరిగిన న్యాయపోరాటంలో చివరికి ట్రంప్ సర్కారు విజయం సాధించింది. అమెరికాలోకి ఇతరుల ప్రయాణాన్ని నిలిపివేసే, జాతీయ భద్రత విధానాన్ని రూపొందించే అధికారాలు అమెరికా అధ్యక్షుడికి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను కోర్టు సమర్థించింది.

బెంచ్‌లోని ఐదుగురు న్యాయమూర్తులు ట్రావెల్ బ్యాన్‌ను సమర్థించగా, మరో నలుగురు ప్రతికూలంగా తీర్పు వెలువరించారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘వావ్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Donald Trump
America
Travel Ban
Supreme Court
  • Loading...

More Telugu News