getup srinu: ఓ రాత్రివేళ కారులో వస్తుండగా టైర్ ఊడిపోయింది: గెటప్ శీను

  • ఒకసారి 'బళ్లారి' నుంచి బయల్దేరాం 
  • అప్పటికే బాగా చీకటిపడింది 
  • అదృష్టం బాగుండి బయటపడ్డాం

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గెటప్ శీను మాట్లాడుతూ, ఒక ప్రమాదం బారి నుంచి తాము బయటపడ్డామంటూ ఆ సంఘటనను గురించి ఇలా చెప్పుకొచ్చాడు. "ఒకసారి మేం బళ్లారి వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాం. అర్థరాత్రి సమయం కావడంతో అందరం మంచి నిద్రలో వున్నాం. కొంతదూరం వచ్చాక అంతకుముందే వేసిన రోడ్డు కావడంతో, మా డ్రైవర్ స్పీడ్ తగ్గించి కారు నడుపుతున్నాడు.

కారు ఒకవైపుకు వాలిపోవడమే కాకుండా పెద్దగా సౌండ్ చేస్తోంది. కారు ఎందుకు ఓ పక్కకి ఒరిగిందో .. ఎందుకు సౌండ్ వస్తుందో తెలుసుకోకుండా డ్రైవర్ అలాగే నడిపేస్తున్నాడు. ఆ సౌండ్ కి నాకు మెలకువ వచ్చి లేచాను .. కారు ఆపమని చెప్పి దిగి వెళ్లి చూశాను. కారుకి వెనక చక్రం ఒకటి లేదు .. ఎక్కడో ఊడిపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమనడంతో ఆ విషయం మిగతా వాళ్లకు చెప్పాను. మా డ్రైవర్ తాగేసి ఉండటం వలన ఆయన టైర్ ఊడిపోయిన విషయాన్ని గమనించలేదు. అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం" అని అన్నాడు.    

getup srinu
ali
  • Loading...

More Telugu News