somireddy: జగన్, పవన్ కల్యాణ్, గాలి జనార్దన్ రెడ్డిలపై సోమిరెడ్డి ఘాటు విమర్శలు

  • సొంత జిల్లా అభివృద్ధి కూడా జగన్ కు పట్టలేదు
  • ఉక్కు కర్మాగారం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు
  • గాలిని మోదీ రంగంలోకి దించారు

కడప జిల్లాను అడ్డం పెట్టుకొని ఎదిగిన వైసీపీ అధినేత జగన్... కడప ఉక్కు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సొంత జిల్లా అభివృద్ధి గురించి కూడా ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.
 
ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లాది రూపాయలను సంపాదించుకున్న గాలి జనార్దన్ రెడ్డిని ప్రధాని మోదీ రంగంలోకి దింపారని ఆరోపించారు. ఐరన్ ఓర్ ను చైనాకు అక్రమ రవాణా చేసిన గాలి... ఇప్పుడు తెరపైకి వచ్చి, స్టీల్ ఫ్యాక్టరీ పెడతాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. మరో మంత్రి జవహర్ మాట్లాడుతూ... బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

somireddy
jagan
Pawan Kalyan
gali janardhan reddy
modi
kadapa
  • Loading...

More Telugu News