CM Ramesh: కడప పౌరుషాన్ని రెచ్చగొట్టొద్దు.. ఇదేమీ సినిమా కాదు!: పవన్ కల్యాణ్ పై సీఎం రమేష్ ఫైర్

  • మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది
  • ఏదైనా మాట్లాడాలనుకుంటే దీక్షాస్థలికి వచ్చి మాట్లాడాలి
  • భావి తరాల కోసమే మా దీక్ష

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రమేష్ మండిపడ్డారు. నీరసంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ... ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీక్షను నీరుగార్చేలా, దీక్ష పవిత్రతను శంకించేలా మీరు మాట్లాడుతున్న మాటలు చాలా దారుణమని అన్నారు. కడప పౌరుషాన్ని రెచ్చగొట్టొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉందని చెప్పారు. ఇది సినిమా కాదని ఎద్దేవా చేశారు.

ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందంటూ పవన్ చేసిన ఆరోపణలు ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయని రమేష్ చెప్పారు. చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే దీక్షాస్థలికి వచ్చి మాట్లాడాలని అన్నారు. తాము చేపట్టిన దీక్ష స్వప్రయోజనాల కోసం కాదని... భావి తరాల కోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

CM Ramesh
Pawan Kalyan
deeksha
steel plant
  • Loading...

More Telugu News