google home mini speakers: గూగుల్ హోమ్, గూగుల్ మినీ స్పీకర్లపై భారీ తగ్గింపులు

  • గూగుల్ హోమ్ ధర రూ.9,999 నుంచి రూ.8,499కు తగ్గుదల
  • హోమ్ మినీ ధర రూ.4,499 నుంచి రూ.3,699కు
  • ఆరు నెలల పాటు గూగుల్ మ్యూజిక్ ఉచిత సేవలు

గూగుల్ తన పర్సనల్ అసిస్టెంట్ స్పీకర్లు గూగుల్ హోమ్, హోమ్ మినీ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమేజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్ల ధరల్ని తగ్గించడంతో గూగుల్ కూడా తన ఉత్పత్తుల ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గూగుల్ హోమ్ రూ.9,999 ధరతో, హోమ్ మినీ రూ.4,499 ధరతో ఈ ఏడాది ఏప్రిల్ లో భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. 


ఇప్పుడు గూగుల్ హోమ్ 17 శాతం తక్కువ ధరకు రూ.8,499కే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. మినీ స్పీకర్ ధర సైతం రూ.3,699కు తగ్గిపోయింది. రెండు డివైజ్ ల కొనుగోలుపై ఫ్లిప్ కార్టు మరో 10 శాతం క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. గూగుల్ సైతం ఆరు నెలల పాటు గూగుల్ ప్లే మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. గూగుల్ హోమ్ కొన్ని రకాల స్మార్ట్ పనులు చేసి పెడుతుందన్న విషయం తెలిసిందే. వంటల గురించి చదివి వినిపించడం, ఈ మెయిల్స్ చదవడంతో పాటు, ట్రాఫిక్ వివరాలను కూడా వాయిస్ రూపంలో తెలియజేస్తుంది. 

google home mini speakers
discount prices
  • Loading...

More Telugu News