chalasani srinivas: ఏపీలో జరుగుతున్న అవినీతిలో బీజేపీకి కూడా వాటా ఉంది: చలసాని శ్రీనివాస్

  • మూడేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు
  • ప్రాజెక్టుల్లో అవినీతిపై ఇప్పుడు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది
  • ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం

ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలను ఉద్దేశించి రాష్ట్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి... ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

ప్రాజెక్టుల్లో అవినీతి జరిగి ఉంటే... అందులో బీజేపీకి కూడా వాటా ఉన్నట్టేనని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం ఈనెల 29న ఆయన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. విశాఖపట్నంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

chalasani srinivas
bjp
Telugudesam
bandh
  • Loading...

More Telugu News