Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో దారుణం... అన్న వెనుక నడుస్తూ వెళ్లి స్కూల్ బస్ కింద నలిగిన చిన్నారి!

  • కుమారుడిని బస్సు ఎక్కించేందుకు వచ్చిన తల్లి
  • వారి వెనకాలే వచ్చిన చిన్నారి ఆదియా
  • పాపను గమనించకుండా బస్సును నడిపిన డ్రైవర్
  • చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు

అన్న స్కూలుకు వెళుతుంటే, వెనకాలే బస్టాప్ వద్దకు వెళుతున్న ఏడాదిన్నర చిన్నారి, స్కూల్ బస్ కింద నలిగి దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా గోపిగడ్డలో జరిగింది. షాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మాంటిస్సోరి హైస్కూల్ కు చెందిన బస్సు కొందరు పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేందుకు గోపిగడ్డకు వచ్చింది. ఆ సమయంలో సాత్విక్ అనే విద్యార్థి తన తల్లి లావణ్యతో కలసి బస్సు ఎక్కేందుకు వస్తుండగా, వారి వెనకాలే చిన్నారి ఆదియా కూడా నడుస్తూ వచ్చింది.

 పెద్ద కుమారుడిని బస్సు ఎక్కించే హడావుడిలో లావణ్య ఉండగా, ఆమె చెయ్యి నుంచి వేరుపడిన ఆదియా, ఇంటివైపు నడిచింది. ఏడాదిన్నర బిడ్డ కాబట్టి బస్సు డ్రైవర్ గానీ, లావణ్య గానీ బాలుడిని గమనించలేదు. బస్సును ముందుకు కదిలించగానే, ఎడమవైపు చక్రం కింద ఆదియా నలిగిపోయింది. చివరిక్షణాల్లో లావణ్య తన కుమార్తెను గమనించి కేకలు పెట్టింది. అయితే డ్రైవర్ బ్రేక్ వేసేలోగానే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. పోలీసులకు విషయం తెలిసి వచ్చేలోగా, బస్సు డ్రైవర్ జంగయ్యను స్థానికులు చితక్కొట్టారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Ranga Reddy District
Bus Accident
Toddler Died
School Bus
  • Loading...

More Telugu News