Tollywood: టాలీవుడ్ సెక్స్ రాకెట్... కిషన్, చంద్రకళలకు విడివిడిగా న్యాయవాదులను ఏర్పాటు చేసిన యూఎస్!

  • టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ ప్రకంపనలు
  • కిషన్, చంద్రకళపై కోర్టులో విచారణ మొదలు
  • అటార్నీలను ప్రకటించిన న్యాయస్థానం

టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్న అమెరికాలో తెలుగు హీరోయిన్ల వ్యభిచారం కేసులో నిందితులైన మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్, మోదుగుమూడి చంద్రకళ అలియాస్ విభాజయంలపై ఇల్లినాయిస్ కోర్టులో విచారణ మొదలైంది. కిషన్, చంద్రకళ దంపతుల తరఫున వాదనలు వినిపించడానికి ఇద్దరు వేర్వేరు అటార్నీలను న్యాయస్థానం ఏర్పాటు చేసింది.

కిషన్ తరఫున వాదనలు వినిపించేందుకు మోరీ ఆర్మర్, చంద్రకళ తరఫున కేరీ ఆంబ్రోసియాలు వాదనలు వినిపించనుండగా, క్రిస్టఫర్ విన్సెస్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఇక భాషా సమస్య తలెత్తకుండా కోర్టును సమన్వయపరిచేందుకు వారణాసి సుబ్బన్న అనే తెలుగు వ్యక్తిని కూడా న్యాయస్థానం నియమించింది. ఇక వరుసగా కేసు విచారణలు సాగనుండగా, నెల రోజుల్లోగా విచారణ పూర్తవుతుందని సమాచారం.

Tollywood
S*x Racket
Kishan Modugumudi
Chandrakala
  • Loading...

More Telugu News