TTD: చూస్తుంటే పింక్ డైమండ్‌ను రమణ దీక్షితులే కాజేసినట్టు అనిపిస్తోంది: రాయపాటి

  • రిజిస్టర్ ప్రకారం నగలన్నీ భద్రం
  • పదవి నుంచి తొలగించారన్న దుగ్ధతోనే ఆరోపణలు
  • రమణ దీక్షితులు చెప్పినవన్నీ అవాస్తవాలే

శ్రీవారి తిరువాభరణాలు తరలిపోయాయంటూ టీడీపీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని బోర్డు సభ్యులు తేల్చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు.

ఆభరణాల పరిశీలన అనంతరం బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు. రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ, పింక్ డైమండ్ అనేది ఒకవేళ ఉండి ఉంటే రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో దానిని ఆయనే కాజేసి ఉండొచ్చని ఆరోపించారు.

కేవలం తనను తొలంగించారన్న దుగ్ధతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తూ అపచారాన్ని మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువాభరణాల రిజిస్టర్ ప్రకారం అన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పిన ఆయన, పగిలిన రూబీని కూడా పరిశీలించినట్టు చెప్పారు. 25 ఏళ్లపాటు కైంకర్యాలు నిర్వహించిన రమణ దీక్షితులు ఇప్పుడు రక్షణ లేదని చెప్పడం శ్రీవారిని అవమానించడమేనని బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి అన్నారు.

TTD
Pink Diamond
Rayapati
Tirumala
Ramana deekshitulu
  • Loading...

More Telugu News