YSRCP: వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలకు అవకాశం ఉంది: విజయసాయిరెడ్డి

  • ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ సిద్ధంగా ఉంది
  • టీడీపీ నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడింది
  • సంక్షేమ పథకాల అమలులో పాదర్శకత లేదు

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పర్యటించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. టీడీపీ నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని, సంక్షేమ పథకాల అమలులో పాదర్శకత లేదని, ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని విమర్శించారు.

నాలుగేళ్లయినా వంశధార ఫేజ్-2 పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. హుద్ హుద్ తుపాన్ కారణంగా శ్రీకాకుళంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇంతవరకూ కొత్త ఇళ్లు కేటాయించలేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాలకు ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఆయన హాజరయ్యారు.   

YSRCP
vijaya sai
  • Loading...

More Telugu News