Governor: చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఫోన్!

  • రమేష్, రవిల ఆరోగ్య పరిస్థితిపై వాకబు
  • ఆసుపత్రికి తరలించాలని సూచన
  • డాక్టర్ల రిపోర్టుకు అనుగుణంగా నడచుకోవాలని సలహా

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గవర్నర్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్షకు దిగిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిపై నరసింహన్ వాకబు చేశారని సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకముందే ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం.

ఈ విషయంలో వైద్యుల బృందం ఇచ్చే రిపోర్టునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు నరసింహన్ సూచించారు. కాగా, తాను కూడా నిత్యమూ వారి ఆరోగ్యం గురించి అధికారులతో మాట్లాడుతున్నానని, వారి దీక్షకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం కడప వాసుల కలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.

Governor
Narasimhan
Chandrababu
CM Ramesh
Ravi
Kadapa
  • Loading...

More Telugu News