Anjan Kumar Yadav: ఆ మాట అనడానికి నీకు సిగ్గుండాలి: దానం నాగేందర్ పై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్

  • సిటీ అధ్యక్ష పదవిని దానంకు నేనే ఇప్పించా
  • పార్టీ అన్యాయం చేసిందని చెప్పడానికి సిగ్గు లేదా?
  • దానం భూకబ్జాదారుడని నాయిని కూడా అన్నారు

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ పై హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఒక బచ్చా అని  అన్నారు. తనకు టికెట్ ఇప్పించానని దానం చెప్పాడని, ఆయన తనకు టికెట్ ఇప్పించడమేంటని ప్రశ్నించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గతంలో దానంకు ఇప్పించింది తానేనని చెప్పారు. ఎదుటి వ్యక్తిపై ఆరోపణలు చేసేముందు... స్థాయి ఏమిటో తెలుసుకోవాలని అన్నారు.

సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో పార్టీకి సంబంధించి ఒక్క కార్యక్రమాన్నైనా దానం నిర్వహించారా? అంటూ అంజన్ కుమార్ మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ లో చేరి, మంత్రి పదవిని అనుభవించిన నీకు పార్టీ అన్యాయం చేసిందా? అంటూ ధ్వజమెత్తారు. ఆ మాట అనడానికి నీకు సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దానం భూకబ్జాదారుడు అని సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డే అన్నారని.. అలాంటి వ్యక్తిని ఇప్పుడు టీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 

Anjan Kumar Yadav
danam nagender
congress
TRS
nayini
  • Loading...

More Telugu News