tarun bhaskar: ఈ నగరానికి ఏమైంది?' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులుగా కేటీఆర్ .. రానా .. చైతూ .. విజయ్ దేవరకొండ

- తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?'
- షార్ట్ ఫిలిమ్స్ దర్శకుల కష్టాల కథ
- ఈ నెల 29వ తేదీన విడుదల
కథా కథనాల్లో .. పాత్రల ఆవిష్కరణలో కొత్తదనాన్ని చూపించే తరుణ్ భాస్కర్, కొత్తనటీనటులతో 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమాను రూపొందించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. హైదరాబాద్ .. 'లోటస్ పాండ్' సమీపంలోని 'రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం'లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది.
