star maa: బిగ్‌బాస్ నుంచి నూతన్ నాయుడు అవుట్.. సామాన్యుడి ఎలిమినేషన్

  • బతికిపోయిన కౌశల్
  • వెళ్తూవెళ్తూ కౌశల్‌పై నాయుడు బిగ్‌బాంబ్
  • రాటుదేలుతున్న నాని

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-2 షో నుంచి సామాన్యుడి కోటాలో అడుగుపెట్టిన నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఈ వారం కౌశల్ ఎలిమినేషన్ ఖాయమని చివరి వరకు అందరూ భావించినా అనూహ్యంగా హౌస్‌లో మొన్న జరిగిన గొడవ కారణంగా ప్రేక్షకుల్లో అతడిపై సానుభూతి పెరిగి విపరీతంగా ఓట్లు పడ్డాయి. దీంతో కౌశల్ బతికిపోయి నూతన్ నాయుడు బలయ్యాడు. గతవారం సంజన హౌస్ నుంచి బయటకు రాగా, ఈసారి నూతన్ నాయుడు బయటకొచ్చాడు. దీంతో హౌస్‌లో సామాన్యుడి కోటాలో ఇక మిగిలింది ఒక్క గణేశ్ మాత్రమే.

శనివారం నాటి షో కాస్త గంభీరంగా అనిపించగా, ఆదివారం ఉత్సాహంగా, సరదాగా సాగింది. నాని కూడా రోజురోజుకు మరింత రాటుదేలుతూ షోను రక్తికట్టిస్తున్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయిన నాయుడు బయటకు వచ్చిన అనంతరం హౌస్‌లో తనతో కలిసిపోయిన కౌశల్, దీప్తిలకు  కృతజ్ఞతలు తెలిపాడు. ఆపదలో అండగా నిలిచారని, నిరాశగా ఉన్నప్పుడు ఉత్సాహం నింపారని పేర్కొన్నాడు.  ‘బిగ్‌ బాంబ్‌’ను తన స్నేహితుడైన కౌశల్‌పై ప్రయోగించి వెళ్లిపోయాడు. కౌశల్‌కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆ బాంబును అతడిపై ప్రయోగించినట్టు నాయుడు తెలిపాడు.  

star maa
BigBoss
Nani
Nutan Naidu
  • Loading...

More Telugu News