gali janardha reddy: ప్రభుత్వం అనుమతిస్తే కడపలో రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తా!: గాలి జనార్దన్ రెడ్డి

  • ఈ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే నా పెట్టుబడి తిరిగి ఇచ్చేయాలి
  • బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టా
  • అవసరమైతే, చంద్రబాబును కలిసి వివరాలు అందజేస్తా

కడప స్టీల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టానని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తనకే అప్పగించాలని కోరారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని, అవసరమైతే, చంద్రబాబును కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని చెప్పారు.  

gali janardha reddy
steel plant
Chandrababu
  • Loading...

More Telugu News