vijaya sai reddy: ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.. సిద్ధంగా ఉండండి: విజయసాయిరెడ్డి

  • వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలు
  • విజయనగరం, అరకులో పర్యటించిన విజయసాయిరెడ్డి, భూమన
  • బూత్ లెవల్ కమిటీల బలోపేతానికి కృషి చేయాలి

  ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.. సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైసీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. విజయనగరం, అరకు వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలను ఈరోజు నిర్వహించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ కమిటీల్లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. విజయనగరం జిల్లాలో ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు గెలవాలని అన్నారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సూక్ష్మ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని, బూత్ లెవల్ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని, పార్టీ జెండాకు ద్రోహం చేయని వారికి స్థానం కల్పించాలని అన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ నిర్వహించిన మినీ మహానాడు కన్నా వైసీపీ ప్లీనరీ సమావేశాలే విజయవంతమయ్యాయని అభిప్రాయపడ్డారు.

vijaya sai reddy
Vijayanagaram District
  • Loading...

More Telugu News