chess: పిన్న వయసులోనే ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్ గా మారిన చెన్నై బాలుడు
- ఇటలీలో గ్రెడిన్ ఓపెన్ లో జీఎం లుకాపై గెలుపు
- 12 ఏళ్ల, 10 నెలల 13రోజులకే గ్రాండ్ మాస్టర్ హోదా
- గతంలో రష్యాకు చెందిన బాలుడు సెర్గేకర్జకిన్12 ఏళ్ల 8నెలలకే ఈ రికార్డు సాధన
ఒకవైపు ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ, స్వీడన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతుంటే, మరోవైపు ఇటలీలోని ఓర్టెసీలో గ్రెడిన్ ఓపెన్ లో ఓ 12 ఏళ్ల బాలుడు చెస్ లో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఆ బాలుడు చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులోనే ప్రపంచ గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. ప్రపంచంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో బాలుడు ప్రజ్ఞానంద కావడం విశేషం. ఇటలీకి చెందిన జీఎం లుకా మొరోనిని ఎనిమిదోరౌండ్ లో మట్టి కరిపించి ఈ రికార్డు నమోదు చేసి గ్రెడిన్ ఓపెన్ లో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డు రష్యాకు చెందిన సెర్గేకర్జకిన్ పేరిట ఉంది. ఇతడు 12 ఏళ్ల 8 నెలలకే 2002లో రికార్డు నమోదు చేశాడు.