Krishna District: పవిత్ర సంగమం ప్రమాదం... ఇంకా లభ్యంకాని మరో విద్యార్థి మృతదేహం!

  • నిన్న నీటిలో గల్లంతైన నలుగురు యువకులు
  • మూడు మృతదేహాలను వెలికితీసిన గజఈతగాళ్లు
  • నాలుగో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు

నిన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురై నీటిలో గల్లంతైన వారిలో బీటెక్ విద్యార్థి రాజ్ కుమార్ మృతదేహం కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి గజఈతగాళ్లతో సోదాలు నిర్వహించిన అధికారులు, చైతన్యరెడ్డి, ప్రవీణ్, శ్రీనాథ్ ల మృతదేహాలను వెలికితీశారు.

అర్ధరాత్రి వరకూ గాలింపు జరిపిన అధికారులు, తిరిగి ఈ ఉదయం లభ్యంకాని మృతదేహం కోసం గాలింపు ప్రారంభించారు. గత సంవత్సరం నవంబర్ లో ఇదే ప్రాంతంలో బోటు బోల్తా పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదుల నీరు కలిసే పవిత్ర సంగమం వద్ద ఇలా నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Krishna District
Pavitra Sangamam
Accident
  • Loading...

More Telugu News