Vijayawada: విజయవాడ సెక్స్ రాకెట్ కేసులో గన్నవరం ఎస్సై సుబ్బారావుపై సస్పెన్షన్ వేటు

  • విజయవాడలో సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్
  • స్థానికులు సమాచారం ఇచ్చినా పట్టించుకోని ఎస్సై
  • విచాణరణలో నిజమని తేలడంతో సస్పెన్షన్ 

విజయవాడలోని జక్కంపూడి కాలనీలో ఇటీవల బయటపడిన సెక్స్ రాకెట్ కేసులో ప్రస్తుత గన్నవరం ఎస్సై సుబ్బారావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటేశారు. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడంలో అప్పటి టూటౌన్ ఎస్సైగా ఉన్న ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలింది. అంతేకాక, సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న మహిళలకు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సీపీ గౌతం సవాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తమ కాలనీలో నడుస్తున్న వ్యభిచార గృహాలపై ఎస్సైకి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని పలువురు కాలనీ వాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేయించిన సీపీ అది నిజమేనని తేలడంతో శనివారం సాయంత్రం సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Vijayawada
Jakkampudi
S*x rocket
SI
Subba Rao
  • Loading...

More Telugu News