jc diwakar reddy: ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సీఎం రమేష్ కు సలహా ఇచ్చా: జేసీ దివాకర్ రెడ్డి

  • మోదీ ఉన్నంత వరకు ఉక్కు ఫ్యాక్టరీ రాదు
  • ఎన్ని దీక్షలు చేసినా ఉపయోగం లేదు
  • దీక్షవల్ల ఉక్కు పరిశ్రమ ప్రాధాన్యత ప్రజలకు తెలుస్తుంది 

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న దీక్షాస్థలికి వచ్చిన ఎంపీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, దీక్షలతో ఉక్కు రాదు... తుక్కు రాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఈరోజు ఆయన వివరణ ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం, స్టీల్ ప్లాంట్ కు మోక్షం లభించదని... ఈ నేపథ్యంలో, దీక్షలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సీఎం రమేష్ కు సలహా ఇచ్చానని చెప్పారు. ఎన్ని దీక్షలు చేసినా ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. కాకపోతే, దీక్ష వల్ల ఉక్కు పరిశ్రమ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చని చెప్పారు.

jc diwakar reddy
cm ramesh
steel plant
modi
  • Loading...

More Telugu News