tg venkatesh: టీజీలాంటి వ్యక్తుల వల్ల ఏపీకి నష్టం: కర్నె ప్రభాకర్

  • టీజీ వెంకటేష్ కు పిచ్చి పట్టింది
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
  • ఇలాంటి వారిని చంద్రబాబు కంట్రోల్ చేయాలి

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేశవరావును తాగుబోతు, సన్నాసి అంటూ వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలని సూచించారు. కేకేను విమర్శించే స్థాయి టీజీకి లేదని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. టీజీలాంటి వారి వల్ల ఏపీకే నష్టమని చెప్పారు. టీజీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రించాలని కోరారు.

tg venkatesh
karne prabhakar
kk
Chandrababu
  • Loading...

More Telugu News