Maharashtra: ప్లాస్టిక్ పై మహారాష్ట్ర సర్కారు మహా సమరం... నేటి నుంచే నిషేధం

  • ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష
  • ప్రజల సహకారం ఉంటేనే విజయమన్న సీఎం ఫడ్నవిస్
  • ప్లాస్టిక్ ను బాధ్యతగా వినియోగించాలని అభిప్రాయం

మహారాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులు, ఒక్కసారి వాడి పడేసే క్యారీ బ్యాగులు, స్పూన్లు, ప్లేట్లు, పెట్ బాటిళ్లు, పీఈటీఈ బాటిళ్లు, థర్మాకోల్ వినియోగంపై నేటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. మొదటి సారి ప్లాస్టిక్ వినియోగిస్తూ పట్టుబడితే రూ.5,000 జరిమానా, రెండో సారి ఉల్లంఘించిన వారికి రూ.10,000 జరిమానా, మూడోసారీ దొరికిపోతే వారికి రూ.25,000 జరిమానాతో పాటు, మూడు నెలల జైలు శిక్ష విధించే చట్టాన్ని మహారాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ... అందరి సహకారం ఉంటేనే నిషేధం విజయవంతం అవుతుందన్నారు. ‘‘ప్లాస్టిక్ ను బాధ్యతగా వినియోగించాలని ఆశిస్తున్నాం. అందుకే సేకరించడానికి వీల్లేని, రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించాం. అయితే, వర్తకులు, చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరించే ఆలోచన చేస్తున్నాం’’ అని చెప్పారు.

Maharashtra
PLASTIC BAN
FROM TODAY
  • Loading...

More Telugu News