danam nagender: వైయస్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్.. ఆయనను నేను ఏనాడూ విమర్శించలేదు: దానం నాగేందర్

  • బీసీల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు
  • గొర్రెలు, బర్రెలు ఇచ్చి పేదవారిని ఆదుకుంటున్నారు
  • టీఆర్ఎస్ నుంచి నాకు ఎలాంటి హామీ రాలేదు

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని... ఆయన తర్వాత వారికి పెద్దపీట వేసిన మరో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని దానం నాగేందర్ అన్నారు. గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారంటూ తనను విమర్శిస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని... గొర్రెలు, బర్రెలు ఇచ్చి పేదవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీసీల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

ఇక వ్యక్తిగతంగా కేసీఆర్ ను తాను ఎన్నడూ విమర్శించలేదని చెప్పారు. తద్వారా తాను టీఆర్ఎస్ లో చేరబోతున్నాననే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ తనకు ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవి ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పారని... కానీ, పదవులు తనకు ముఖ్యం కాదని, అందుకే పదవి రాకముందే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

danam nagender
congress
  • Loading...

More Telugu News