chiranjeevi: చిరంజీవి అల్లుడి ఫంక్షన్ కు అతిథిగా బాలయ్య?

  • 'విజేత' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న చిరంజీవి చిన్నల్లుడు
  • 24న ఆడియో ఫంక్షన్
  • వేడుకకు బాలయ్య వస్తున్నారంటూ టాక్

'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫంక్షన్ సందర్భంగా ఒకే వేదికపైన కనిపించిన చిరంజీవి, బాలకృష్ణలు... మరోసారి స్టేజ్ ను షేర్ చేసుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం. మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'విజేత'. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, బాలయ్య కూడా ఈ వేడుకకు వస్తున్నారని చెబుతున్నారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్. ఇదే జరిగితే... టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.

chiranjeevi
Balakrishna
kalyan dev
vijetha
audio function
  • Loading...

More Telugu News