Chikmagalur: బీజేపీ చిక్‌మగళూరు జనరల్ సెక్రటరీ దారుణ హత్య!

  • కత్తులతో పొడిచి చంపిన దుండగులు
  • ప్రాణం పోయేంత వరకు చూసి పరారీ
  • నిందితుల కోసం పోలీసుల వేట

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఒకరు దారుణహత్యకు గురయ్యారు. చిక్‌మగళూరు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్వర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. గౌరీ కెనాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న అన్వర్‌పై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన అన్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ప్రాణాలు విడిచేంత వరకు దుండుగులు అక్కడే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అన్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.

Chikmagalur
Karnataka
BJP
Murder
  • Loading...

More Telugu News