Ali: రాజకీయ రంగ ప్రవేశంపై అలీ క్లారిటీ!
- సమయం వచ్చినప్పుడు చెబుతానన్న అలీ
- పీఏ పెళ్లికి హాజరైన నటుడు
- సెల్ఫీల కోసం ఎగబడిన జనం
త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలపై ప్రముఖ సినీ నటుడు అలీ స్పందించారు. అలీ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మసునూరి వరప్రసాద్ పెళ్లితో ఓ ఇంటి వాడయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రు శివారులోని జొన్నాడవారి పేటలో శుక్రవారం జరిగిన వరప్రసాద్ వివాహానికి అలీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. రాజకీయ అరంగేట్రం ఎప్పుడని విలేకరులు అలీని ప్రశ్నించారు. స్పందించిన అలీ మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని అంటున్నారు. మరోవైపు పెళ్లికి అలీ హాజరు కావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారిపోయింది. అలీతో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు.