biryani: విజయవాడ హోటల్‌లో బిర్యానీలో బల్లి.. ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు!

  • ఇద్దరికి అస్వస్థత
  • ఆసుపత్రికి తరలింపు
  • దర్యాప్తు చేపట్టిన అధికారులు

ఇటీవలే వరంగల్‌ లోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి బోజనంలో ఎలుక కనపడిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే విజయవాడ నగరంలోని  టీచర్స్‌ కాలనీలో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆకలి కడుపుతో అక్కడి సిల్వర్‌స్పూన్‌ హోటల్‌లోకి వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసిన ఇద్దరు వ్యక్తులకు సదరు హోటల్‌ సిబ్బంది బల్లి పడిన చికెన్ బిర్యానీ ఇచ్చారు.

కడుపు నిండా భోజనం చేసిన తరువాత వారు అస్వస్థతకు గురయి వాంతులు చేసుకున్నారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోటల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేయగా, అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్‌ బిర్యానీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

biryani
customers
  • Loading...

More Telugu News