diwakar reddy: దీక్షలతో ఉక్కూ రాదు, తుక్కూ రాదు: జేసీ దివాకర్ రెడ్డి

  • ఏపీకి మోదీ ఏమీ చేయరని మూడేళ్ల క్రితమే చెప్పా
  • చంద్రబాబుకు పరిస్థితి ఇప్పుడు అర్థమైంది
  • జగన్ కు అహంకారం ఎక్కువ

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. దీక్షల వల్ల ఉక్కూ రాదు, తుక్కూ రాదు అంటూ తేల్చి చెప్పారు. ఏపీకి ప్రధాని మోదీ ఏమీ చేయరని మూడేళ్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని... ఇప్పుడు ఆయనకు పరిస్థితి అర్థమయిందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఉన్న భయంతో వారి మీది ఎవరైనా చేయి వేయాలన్నా భయపడేవారని... ప్రస్తుతం ఆ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డిలోని సగం లక్షణాలు జగన్ లో ఉన్నా, ఆయన వెంట వెళ్లి ఉండేవారమని చెప్పారు. జగన్ కు అహంకారం చాలా ఎక్కువని అన్నారు.

diwakar reddy
Chandrababu
jagan
modi
cm ramesh
  • Loading...

More Telugu News