passed away: ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ కన్నుమూత
- 1951లో 18 ఏళ్ల వయసులోనే తొలి అవార్డు
- 'పేరంటాలు' సినిమాపై నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి
- 1995లో ఉత్తమ ఫిలిం క్రిటిక్ గా నంది అవార్డు
- 2013లో 'సినిమాగా సినిమా'కి ఉత్తమ సినిమా గ్రంథం అవార్డు
ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ఈ రోజు హైదరాబాదులో కన్నుమూశారు. 1951లో 18 ఏళ్ల వయసులోనే దర్శకుడు గోపీచంద్ 'పేరంటాలు' సినిమాపై నిర్వహించిన పోటీలో ఆయన ప్రథమ బహుమతి పొందారు. 1995లో ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా ఏపీ సర్కారు నుంచి నంది అవార్డు పొందారు. 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా 'దాసరి నారాయణ రావు స్వర్ణ పతకం' అందుకున్నారు.
ఆయన రాసిన 'సినిమాగా సినిమా' కి గానూ 2013లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ సినిమా గ్రంథం అవార్డు వచ్చింది. 1985-87 కాలంలో ఏపీ, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికార పత్రిక 'తెలుగు వెలుగు' కు తొలి సంపాదకుడిగా పనిచేశారు. ఇవేగాక ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.