amit shah: అమిత్ షా జీ.. కంగ్రాచ్యులేషన్స్: రాహుల్ గాంధీ ఎద్దేవా

  • అహ్మదాబాద్ కు చెందిన సహకార బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న అమిత్ షా
  • నోట్ల రద్దు సమయంలో 5 రోజుల్లోనే రూ. 750 కోట్ల మార్పిడి
  • మీ విజయానికి శాల్యూట్ చేస్తున్నానంటూ రాహుల్ ఎద్దేవా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న బ్యాంకు టాప్ ప్లేస్ కొట్టేసిందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్ కు చెందిన సహకార బ్యాంకు నోట్ల మార్పిడిలో తొలి స్థానాన్ని ఆక్రమించిందని విమర్శించారు. నోట్ల రద్దు జరిగిన తర్వాత... కేవలం ఐదు రోజుల్లోనే రూ. 750 కోట్ల పాత నోట్లను మార్చి రికార్డు సృష్టించిందని అన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా 'అమిత్ షా జీ... కంగ్రాచ్యులేషన్స్' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మీరు సాధించిన విజయానికి శాల్యూట్ చేస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. 

amit shah
Rahul Gandhi
ahmedabad
cooperative bank
demonetisation
  • Error fetching data: Network response was not ok

More Telugu News