Jammu And Kashmir: కశ్మీర్ లో ఐసిస్ మూలాలు.. ఈ ఉదయం కాల్చి చంపింది వారినే!

  • అనంతనాగ్ లో ఈ ఉదయం ఎన్ కౌంటర్
  • నలుగురు ముష్కరులు హతం
  • టెర్రరిస్టులు జేకేఐఎస్ కు చెందినవారు  

కశ్మీర్ లోయలో ఇప్పటి వరకు ఐసిస్ సానుభూతిపరులు మాత్రమే ఉన్నారనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ సంస్థ ముష్కరులు కూడా అడుగుపెట్టారు. ఈ ఉదయం అనంతనాగ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులను మన భద్రతాబలగాలు కాల్చి చంపాయి.ఈ ముష్కరులకు ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని... వీరు జమ్ముకశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (జేకేఐఎస్) కు చెందినవారని జమ్ముకశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వయిద్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో జేకేఐఎస్ అధినేత కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. కశ్మీర్ లోయలో ఐసిస్ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.

Jammu And Kashmir
anantnag
encounter
jkis
isis
  • Loading...

More Telugu News