Balakrishna: బసవతారకం ఆసుపత్రి వేడుకల్లో బాలకృష్ణ, కల్వకుంట్ల కవిత, శ్రియ

- బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలు
- తక్కువ ఖర్చుతోనే మెరుగైన సేవలందిస్తున్నామన్న బాలయ్య
- తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించాలన్న కవిత
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ఛైర్మన్, సీనీ నటుడు బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, హీరోయిన్ శ్రియలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం ఆసుపత్రి ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్య సేవలు పొందిన ఏ ఒక్కరు ప్రశంసించినా... సాక్షాత్తు అమ్మే దీవించిందని అనుకుంటామని చెప్పారు. ఆసుపత్రికి ట్యాక్స్ రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని... తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

