mahesh babu: అల్లు అరవింద్ నిర్మాతగా మహేశ్ బాబు మూవీ?

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • ఆయనతో చర్చించిన అల్లు అరవింద్ 
  • ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్  

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'డెహ్రా డూన్'లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు సినిమా ఏ బ్యానర్లో వుండనుందనే విషయమే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్ లో మహేశ్ బాబు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇటీవలే మహేశ్ బాబు .. అల్లు అరవింద్ కలిసి ఒక ప్రాజెక్టు గురించిన చర్చలు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. మంచి కథ .. దర్శకుడు కుదిరితే చేయడానికి తాను సిద్ధంగా వున్నట్టుగా మహేశ్ బాబు చెప్పడం జరిగిందని అంటున్నారు. ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసే అల్లు అరవింద్, మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేయడమే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఇతర హీరోలతోను అల్లు అరవింద్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి .. ఆయన మహేశ్ తో ట్రై చేయడం నిజమై ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు.  

mahesh babu
allu aravind
  • Loading...

More Telugu News