Narendra Modi: మోదీకి మద్దతివ్వాలంటూ... రాజమౌళిని కోరిన కేంద్రమంత్రి!

  • హైదరాబాద్ లోని రాజమౌళి ఇంటికి హన్స్ రాజ్ ఆహిర్
  • మోదీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరణ
  • శాలువాలు కప్పి సత్కరించిన కేంద్ర మంత్రి

'బాహుబలి'తో విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ లతో కేంద్ర మంత్రి హన్స్‌ రాజ్‌ ఆహిర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని రాజమౌళి ఇంటికి పలువురు బీజేపీ నేతలతో కలసి వచ్చిన ఆయన, గడచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి, ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. హన్స్ రాజ్ ఆహిర్ తో పాటు బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, బీజేవైఎం నాయకుడు సాయి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లకు హన్స్ రాజ్ శాలువాలు కప్పి సత్కరించారు.

Narendra Modi
Rajamouli
Vijayendraprasad
Hansraj ahir
Kishan Reddy
  • Loading...

More Telugu News