deve gouda: యోగా డే రోజున దేవెగౌడ వేసిన యోగాసనాలకు కేటీఆర్‌ సహా అందరూ ఫిదా!

  • దేవెగౌడ యోగాపై జమ్ముకశ్మీర్‌ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌
  • కేటీఆర్‌ రీ ట్వీట్‌
  • ఇది మార్ఫ్ చేసిన ఫొటో కాదు కదా? అంటూ ఆశ్చర్యం

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్‌నెస్‌ సవాలు విసరగా... ఆ ట్వీట్‌కు కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించి పలు యోగాసనాలు వేసి ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా దేవెగౌడ మరోసారి యోగా చేసి అలరించారు.

పరుపుపై పడుకొని ఆయన ఆసనం వేశారు. దీనిపై జమ్ముకశ్మీర్‌ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌ చేయగా, దాన్ని రీట్వీట్‌ చేస్తూ స్పందించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీరు చెప్పేది నిజమేనా.. ఇది మార్ఫ్ చేసిన ఫొటో కాదు కదా? అంటూ కామెంట్ చేశారు. కాగా, దేవెగౌడకు యోగా చేయడం అలవాటే. ఆయన ఈరోజు కూడా ఎన్నో యోగాసనాలు వేశారు. 

deve gouda
KTR
yoga
  • Error fetching data: Network response was not ok

More Telugu News