dk shivakumar: కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ పై మరో కేసు నమోదు

  • ఢిల్లీలోని నివాసంలో రూ.4.03 లక్షలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ
  • నాలుగో కేసు నమోదు
  • ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న శివకుమార్

ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ పై మరో కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రోడ్డులో ఉన్న శివ కుమార్ సొంత అపార్ట్ మెంట్ నుంచి ఐటీ అధికారులు రూ. 4.03 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆయనపై నాలుగో కేసు నమోదైంది. ఈ సొమ్ము వ్యవసాయ ఆదాయమని శివకుమార్ ప్రకటించారు. మరోవైపు, లెక్కల్లో చూపని సొమ్మును ఏఐసీసీ ఖాతాకు శివకుమార్ బదిలీ చేసినట్టు ఐటీ శాఖ ఆరోపించినట్టు సమాచారం. గతంలో నమోదైన మూడు కేసుల్లో శివకుమార్ బెయిల్ పొందారు.

dk shivakumar
karnataka
minister
congress
it
raids
case
  • Loading...

More Telugu News