omar abdullah: ఒమర్ అబ్దుల్లా ఎందుకు అంత భయపడుతున్నారు?: రామ్ మాధవ్

  • నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలను లాక్కోం
  • అలాంటి పనులు ఆ పార్టీనే చేసింది
  • తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది

నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము పాల్పడమని... అయినా, ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఆ పార్టీ నేతలంతా ఒమర్ పట్ల విశ్వాసంగానే ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఆకర్షించడం వంటి పనులు గతంలో నేషనల్ కాన్ఫరెన్సే చేసిందని విమర్శించారు.

జమ్ముకశ్మీర్ తో పాటు యావత్ దేశ ప్రయోజనాల కోసమే పీడీపీతో తాము తెగదెంపులు చేసుకున్నామని రామ్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర ఉన్నతి కోసం తాము పని చేస్తామని తెలిపారు. తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

omar abdullah
ram madhav
Jammu And Kashmir
pdp
  • Loading...

More Telugu News