devineni: ప్రాజెక్టు ఖర్చులు పెరిగాయి.. నిర్మాణ అంచనాలను సవరించండి!: నితిన్‌ గడ్కరీకి దేవినేని ఉమ లేఖ

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరిస్తూ లేఖ
  • పోలవరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
  • ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను సవరించాలి 
  • రూ.10 వేల కోట్లు విడుదల చేయాలి

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరిస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లేఖ రాశారు. పోలవరానికి ఖర్చు చేసిన నిధుల్లో రూ.1400 కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ప్రాజెక్టు ఖర్చులు పెరిగిన దృష్ట్యా నిర్మాణ అంచనాలను సవరించాలని, అందుకోసం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

సవరించిన అంచనాలను పరిగణనలోకి తీసుకుని రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సదరు కేంద్ర మంత్రిని దేవినేని ఉమా మహేశ్వరరావు కోరారు. పోలవరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌ సస్యశ్యామలం అవుతుందని లేఖలో పేర్కొన్నారు.                                

devineni
nitin gadkari
Andhra Pradesh
polavaram
  • Loading...

More Telugu News