internet: మన దేశంలో ప్రతి నలుగురిలో నెట్ వాడేది ఒకరే!
- 2017 సంవత్సరానికి ప్యూ రీసెర్చ్ నివేదిక
- దేశంలో పెద్దవారిలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నది 22 శాతం మంది
- ఫేస్ బుక్, ట్విట్టర్ గురించి తెలియని 80 శాతం జనాభా
డిజిటల్ ఇండియా అని మోదీ సర్కారు ఓ వైపు మొత్తుకుంటుంటే, మరోవైపు డిజిటల్ కు ఆధారమైన ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న వారు ఇప్పటికీ పావుశాతానికి మించలేదు. 2017లో మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరే నెట్ వినియోగించినట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలో తక్కువ వినియోగం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
దక్షిణ కొరియాలో అత్యధికంగా పెద్దవారిలో 96 శాతం ఇంటర్నెట్ తో అనుసంధానమైన వారేనని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల్లో ప్యూ రీసెర్చ్ ఈ సర్వే నిర్వహించింది. భారత్ లో పెద్ద వారిలో 12 శాతం మంది 2013లో స్మార్ట్ ఫోన్లు వాడుతుంటే 2017 నాటికి 22 శాతానికి అది పెరిగినట్టు ప్యూ రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. 78 శాతం పెద్దలు స్మార్ట్ ఫోన్లను వాడడం లేదని, ఇక 80 శాతం మందికి ఫేస్ బుక్, ట్విట్టర్ గురించి తెలియదని పేర్కొంది.